రూ.కోట్లు పెడితే వారానికి రూ.10కోట్లు..!

హనుమాన్ అంశ్’ (Hanuman Ansh) చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న సునామీ, భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయంగా నిలిచిపోతుంది. కేవలం ₹2 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ డివోషనల్ డ్రామా, కేవలం మౌత్ టాక్తో ఏకంగా వందల కోట్ల భారీ చిత్రాలను వెనక్కి నెట్టి విక్టరీ మార్చ్ చేస్తోంది.
ఏ పెద్ద సినిమాకైనా 4వ వారం వచ్చేసరికి కలెక్షన్లు పూర్తిగా పడిపోతాయి. కానీ ‘హనుమాన్ అంశ్’ విషయంలో మాత్రం పూర్తి ఉల్టా జరిగింది. 3వ వారంలో కేవలం ₹10.40 కోట్లు రాబట్టిన ఈ చిత్రం, 4వ వారంలో ఏకంగా ₹61 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించి అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది.
ధురందర్ 2′ (₹56 కోట్లు), ‘ఛావా’ (₹55.78 కోట్లు) వంటి భారీ చిత్రాల రికార్డులను ఇది బ్రేక్ చేసింది. కేవలం ₹2 కోట్ల పెట్టుబడితో ఏకంగా 3900% పైగా లాభాలను (ROI) ఆర్జించి, 2026లోనే అత్యంత లాభదాయకమైన చిత్రంగా నిలిచింది
