బడా చోర్ బాస్కెట్

0
1000134684
Share

చికెన్ ఆర్డర్ చేశాడు.. ఇంటికి వచ్చేసరికి కుళ్లిన చికెన్

శేఖర్అ నే కస్టమర్ BigBasketలో చికెన్ ఆర్డర్ చేశాడు. మంచి ఆఫర్ కనిపించడంతో ఆర్డర్ పెట్టిన ఆయనకు.. డెలివరీ వచ్చిన తర్వాత షాక్ ఎదురైంది. తాను ఆర్డర్ చేసిన ఫ్రెష్ చికెన్‌కు బదులుగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న చికెన్ డెలివరీ అయినట్లు ఆయన గుర్తించాడు.

దీంతో వెంటనే BigBasket కస్టమర్ కేర్‌ను సంప్రదించాడు. తనకు వచ్చిన చికెన్ నాణ్యత బాగోలేదని, దాన్ని తిరిగి తీసుకెళ్లాలని కోరాడు. కస్టమర్ ఫిర్యాదును స్వీకరించిన BigBasket మొదట రిటర్న్ రిక్వెస్ట్‌ను అంగీకరించింది. కొంత సమయం తర్వాత డెలివరీ పికప్ చేస్తామని కస్టమర్‌కు సమాచారం ఇచ్చింది.

అయితే అసలు సమస్య అక్కడే మొదలైంది.

కొన్ని గంటల తర్వాత పికప్ చేస్తామని చెప్పిన తర్వాత.. తిరిగి రిటర్న్ రిక్వెస్ట్ క్యాన్సల్ అయినట్లు కస్టమర్‌కు మెసేజ్ వచ్చింది. అంటే మొదట రిటర్న్‌ను అంగీకరించిన సంస్థ.. ఆ తర్వాత అదే రిటర్న్‌ను క్యాన్సల్ చేయడంతో కస్టమర్‌కు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

ఆ తర్వాత రిఫండ్ చేస్తామని సమాచారం వచ్చినప్పటికీ.. కస్టమర్‌కు వచ్చిన ప్రధాన ప్రశ్న మాత్రం అలాగే ఉంది:

“కుళ్లిపోయిన చికెన్‌ను తీసుకెళ్లకుండా రిఫండ్ ఎలా? ఇలాంటి ఆహారాన్ని కస్టమర్ ఇంటి వద్దే వదిలేస్తే బాధ్యత ఎవరిది?”

కస్టమర్ డబ్బులు తిరిగి పొందడం ఒక అంశం అయితే.. అంతకంటే ముఖ్యమైనది పాడైపోయిన ఆహార పదార్థాన్ని కస్టమర్‌కు డెలివరీ చేయడం ఎలా జరిగింది? అనేదే.

ఫ్రెష్ ఫుడ్ విషయంలో నాణ్యత తనిఖీలు ఎలా జరుగుతున్నాయి? డెలివరీకి ముందు చికెన్ నాణ్యతను ఎవరు చెక్ చేస్తున్నారు? కస్టమర్ ఫిర్యాదు చేసిన తర్వాత రిటర్న్‌ను అంగీకరించి మళ్లీ ఎందుకు క్యాన్సల్ చేశారు? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.

ఒకవేళ కస్టమర్‌కు వచ్చిన చికెన్ నిజంగానే వినియోగానికి అనర్హమైనదైతే.. అది కేవలం రిఫండ్ సమస్య కాదు. ఇది ఫుడ్ క్వాలిటీ, కస్టమర్ సేఫ్టీకి సంబంధించిన విషయం.

అందుకే ఇలాంటి ఫిర్యాదులపై కంపెనీ కేవలం “రిఫండ్ చేస్తాం” అని చెప్పడం కాకుండా.. ఆ ఉత్పత్తి కస్టమర్‌కు ఎలా డెలివరీ అయింది, నాణ్యత తనిఖీ ఎక్కడ విఫలమైంది, రిటర్న్ ఎందుకు క్యాన్సల్ అయింది అనే విషయాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

ఇలా ఒక్క శేఖర్ ఒక్కడే రోజుకు పదుల సంఖ్యలో కస్టమర్లు మోసం పోతున్నారు..సో బిగ్ బాస్కెట్ లో నాన్ వెజ్ జోలికి అసలు వెళ్లకండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *