హరే కృష్ణ మహా మంత్రమే వారిని కాపాడింది..! తొమ్మిది రోజులు నేపాల్ సొరంగంలో ఇలా బతికారు…

0
1000128563
Share

చిన్నప్పుడు భయమైతే దేవుడిని తలుచుకునే వాళ్ళం..ఎక్కువగా హనుమాన్ ని గుర్తుచేసుకునేవాళ్ళం. శ్రీ ఆంజనేయము.. ప్రసన్న ఆంజనేయ అనుకునే వాళ్ళం. ఇలా చేయడం వల్ల ధైర్యం వచ్చేది. ఇప్పుడు నేపాల్ వరదల్లో సొరంగంలో చిక్కుకున్న ఇద్దరు ఇలాగే ప ఠనమ్ చేశారు..9రోజుల తర్వాత మృత్యుంజయులుగా వచ్చారు. ఇక్కడ దేవుడు వచ్చి వారిని కాపాడాడు అని కాదు.ఒక నమ్మకం వారిలో భయాన్ని పోగొట్టింది.ఒక నమ్మకం వారికి పునర్జన్మ ఇచ్చింది.ఆ నమ్మకమే ప్రాణాలతో తిరిగొచ్చేలా చేసింది.నేపాల్ టన్నెల్ లో మెకానిక్ ఫోర్మన్, సూపర్ వైజర్ చిక్కుకుపోయారు..నేపాల్ త్రిశూలి 3 హైడ్రో పవర్ ప్లాంట్ వరదలకు కొట్టుకుపోయింది.. ఇందులో ఉన్న 42 మంది గల్లంతు అయ్యారు..9రోజులైంది..బతికి ఉంటారనే ఆశలు లేవు..అయినా రెస్క్యూ ఆపరేషన్స్ ఆపలేదు.. ఓ చిన్న ఆశ అటువైపు రాళ్లు, శిథిలాలు తవ్వేలా చేసింది.అదే ఆ 42 మందిలో ఇద్దరినీ బతికించింది.మిగతా 40 మంది సిబ్బంది కూడా బతికి ఉంటారన్న నమ్మకంతో నేపాల్ ఆర్మీ రెస్క్యూ స్పీడప్ చేసింది.

సంజయ్ సాహు, కబీర్ maharjan..తొమ్మిది రోజులు ఎలా బతికారంటే..

పవర్ ప్లాంట్ లో పనిచేసే వాళ్లకు ఆక్సిజన్ బయట నుంచి అందుతుంది.ఎయిర్ సిస్టమ్, ట్రాప్డ్ water బయటనుంచి పైపుల ద్వారా అందుతుంది..ఇదే వాళ్ళను 9రోజులు కాపాడింది. సొరంగం లో ఫుడ్ ఐటమ్స్ కూడా వారిని సేవ్ చేశాయి.. ఇందులో ఒకరైనా సంజయ్ సాహు..తనను హరే కృష్ణ మంత్రమే కాపాడింది అని చెబుతున్నాడు.ఎవరి నమ్మకం వారిది…అది చదవడం వల్ల అతనిలో టెన్షన్ తగ్గింది. ఇది మాత్రం నిజం.. లేకపోతే అంతే..టెన్షన్ ఉండేది.ఈ భయం తోనే ప్రాణాలు పోయేవి. https://x.com/NepaliArmyHQ/status/2095888726685777935/video/1

https://x.com/NepaliArmyHQ/status/2095888726685777935

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *