సెలవు కోసం ఇంత దారుణమా..? ఎలా వస్తున్నాయి రా మీకు ఈ ఆలోచనలు..

0
Share

సహవిద్యార్థి చనిపోతే పాఠశాలను మూసివేస్తారనే నమ్మకంతో.. రూమ్‌మేట్‌పై 8వ తరగతి విద్యార్థులు హత్యాయత్నం చేశారు

అన్నమయ్య జిల్లా, కంభంవారిపల్లె మండలం, గ్యారంపల్లెలోని ఒక గురుకుల పాఠశాలలో, ఇద్దరు బాలురు తమ గదిలో ఒక విద్యార్థి ముఖంపై దిండు పెట్టి, గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించారు.

వారి నుంచి తప్పించుకుని సిబ్బందికి ఫిర్యాదు చేసిన బాధితుడైన బాలుడు.

పై అధికారులు ఈ విషయం తెలుసుకుని విచారించగా, గతంలో ఒక విద్యార్థి మరణించినప్పుడు పాఠశాలకు సెలవు ఇచ్చేవారని, అందుకే ఈ విద్యార్థిని చంపితే తమకు కూడా సెలవు వస్తుందని భావించి, ఆ ఇద్దరు అబ్బాయిలు తమ నేరాన్ని అంగీకరించారు.

హత్యాయత్నంలో పాల్గొన్న బాలురకు అధికారులు టీసీ (బదిలీ ధృవపత్రం) జారీ చేసి వారిని పంపించివేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *