నారాయణ కాలేజ్ లో గ్యాంగ్ వార్.. పొట్టు పొట్టు కొట్టుకున్నారు..!
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జూనియర్ కళాశాల సంతోష్‌నగర్ బ్రాంచ్‌లో, పరీక్ష పత్రం విషయంలో ఇద్దరు మైనర్ విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం గ్యాంగ్ వార్ కు దారితీసింది.ఇండో-ఇంగ్లీష్ 7బి గ్రౌండ్లో సయ్యద్ నోమాన్ అనే విద్యార్థిపై కొందరు యువకులు దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.
ఇరుపక్షాల ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

