ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసే ముందు..ఒక్క విషయం…

0
1000131959
Share

జొమాటో కస్టమర్లకు మరో షాక్.. క్యాష్ ఆన్ డెలివరీపైనా ఛార్జీ!

ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్లకు జొమాటో మరో షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు ఆన్‌లైన్ పేమెంట్స్‌పై వివిధ రకాల ఛార్జీలు వసూలు చేస్తున్న ఫుడ్ డెలివరీ యాప్స్‌.. ఇప్పుడు క్యాష్ ఆన్ డెలివరీకూ ఛార్జీలు విధిస్తున్నాయి.

జొమాటోలో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకుంటే.. ఆర్డర్‌పై దాదాపు రూ.5 నుంచి రూ.9 వరకు అదనపు ఛార్జీ పడుతున్నట్లు కస్టమర్లు చెబుతున్నారు. దీంతో ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయాలంటేనే వినియోగదారులు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ఇప్పటికే ఫుడ్ బిల్‌ కంటే అదనపు ఛార్జీలే ఎక్కువగా కనిపిస్తున్నాయన్నది కస్టమర్ల ఆవేదన.

ఫుడ్ ధర ఒకటి.. దానికి జీఎస్టీ ఛార్జీలు, రెస్టారెంట్ ఛార్జీలు, డెలివరీ ఫీజు, ప్లాట్‌ఫామ్ ఫీజు.. ఇలా ఒక్కో పేరుతో మరో ఛార్జీ జతవుతోంది. చివరికి కస్టమర్ చేతికి వచ్చే బిల్లు చూస్తే మాత్రం.. తిన్న ఫుడ్ ధర కంటే చెల్లించిన మొత్తం ఎందుకింత పెరిగిందా? అనే అనుమానం వస్తోంది.

జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్స్‌లో ఆర్డర్ చేసే సమయంలో మొదట కనిపించే ధర ఒకటైతే.. చివర్లో పేమెంట్ చేసే సమయానికి మరో ధర కనిపిస్తోందని వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇప్పుడు క్యాష్ ఆన్ డెలివరీకూ అదనపు ఛార్జీలు వసూలు చేస్తుండటంతో.. “ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే ఫుడ్ కంటే ఛార్జీలే ఎక్కువయ్యేలా ఉన్నాయి” అంటూ కస్టమర్లు మండిపడుతున్నారు.

మరి ఈ అదనపు ఛార్జీలకు జొమాటో, స్విగ్గీ వంటి సంస్థలు ఎలాంటి వివరణ ఇస్తాయో చూడాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *