సూపర్ సాంగ్.. అచ్చ తెలంగాణ యాసలో..భాషలో..
ఏష నాగుల కట్ట మీద ఏదైనా ఏసిన ఉయ్యాలా…తాగి ఊగుదమే బాలా… ఇప్పుడు సోషల్ మీడియాను ఊ పే ఈ ఫోక్ సాంగ్. అచ్చ తెలంగాణ యాసలో, భాషలో రాసింది.సాంగ్ మ్యూజిక్ మెమరబుల్ మ్యాజిక్.ఎవరో అన్నారు తాగి ఊగడం తప్ప ఏమి అర్థమవడం లేదని..కానీ ఏది అబద్దం.ప్రతి లైన్ లో మాటలు తెలంగాణ గల్లీలో వినిపిస్తాయి. ఒక్కప్పుడు పల్లెలో మామూలు జనం వాడే పదాలే. కాసర్ల శ్యామ్ మస్తు రాసిండు..దీనికి అనిరుధ్ మ్యూజిక్ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్..మెలోడీ మాయలోడు ఊర మాస్ బీట్స్ కొట్టాడు..శ్రీకాంత్ ఓదెల.. నీ సెలెక్షన్ సూపర్..నానికి హిట్స్ కలెక్షన్.కీర్తి నువ్వు గ్రేట్..ఈ ఇప్ప సారాయి అంటే ఇప్ప పువ్వు తో చేస్తారు..pure wine.. ఖర్చుతో కూడినది కాకపోయినా ఈ ఇప్ప సారాయి తయారు చేయడం చాలా కష్టం.ఎందుకంటే అడవుల్లోకి వెళ్ళి ఇప్ప పువ్వు తేవాలి.. తెచ్చాకా దీని కాయడం అంత ఈజీ కాదు..అందుకే చాలా మందికి తాగాలనీ ఉన్నా తీరని కోరిక..పల్లెలో కొంచెం బలసిన ఆసామి .. ప్రత్యేకంగా తయారు చేయించుకునే వాళ్ళు..అందుకే దొరలు తాగు ఇప్ప సారాయి అని శ్యామ్ వాడి ఉంటాడు.. ఇలా ప్రతి పదం తెలంగాణ వాళ్ళ మనసులో నుంచి పుట్టిందే..తాగి ఊగుదాo అంటే సంతోషంగా ఉందామని అర్థం.. శ్రీకాంత్ ఓదెల మామూలోడు కాదు..తెలంగాణలో మరో ప్రపంచం పల్స్ పట్టినోడు..ఇక ప్రతి సినిమా పూనకాలు లోడింగ్…నాని రియల్లీ నాచురల్ స్టార్..నటనలోనే కాదు.. దర్శకుల ఎంపికలోనూ ఇంతే…

