సారీ శిరీష.. ఈ సమాజం ఇంతే…

0
1000122606
Share

by srini

నర్స్ శిరీషకు ఎంతో అన్యాయం జరిగింది.. సీనియర్ జర్నలిస్ట్ శ్రీని మాటల్లో…

మారుమూల పల్లెటూరి నుంచి ఎన్నో ఆశలతో భాగ్యనగరానికి వచ్చిన ఒక అమాయక గిరిజన బిడ్డ, నర్సు శిరీష కథ ఇది.

కన్నవారి కళ్లలో ఆనందం చూడాలని, రెక్కాడితే గానీ డొక్కాడని దినసరి కూలీలైన తన తల్లిదండ్రులు, సోదరుడికి ఆసరాగా నిలవాలని ఆమె హైదరాబాద్ అడుగుపెట్టింది.

తెల్లటి నర్సు దుస్తుల్లో రోగులకు సేవ చేస్తూ, తన కుటుంబానికి తనే పెద్ద దిక్కుగా మారి ఇల్లంతా తనే పోషించాలనుకుంది. ఆ చిన్నారి కళ్ల నిండా కుటుంబ భవిష్యత్తుపై ఎన్నో అందమైన ఆశలు, ఆశయాలు మాత్రమే ఉన్నాయి.

కానీ, ఒక అర్ధరాత్రి వేళ కామంతో కళ్లు మూసుకుపోయిన దుర్మార్గుడు
మహ్మద్ సనావుల్లా ఖాన్ ఆమె ఆశలను, ఆయుష్షును దారుణంగా చిదిమేశాడు. గదిలోకి చొరబడి, ఆమె తీవ్రంగా ప్రతిఘటించినా వినకుండా ప్రాణాలు తీశాడు. చంపిన తర్వాత కూడా మృగాడిలా ప్రవర్తించిన ఆ రాక్షసుడి చర్య సమాజం తలదించుకునేలా చేసింది.

కన్నబిడ్డను కోల్పోయి ఆ పేద కుటుంబం గుండె పగిలి ఏడుస్తోంది. అయితే, ఇంతటి ఘోరం జరిగినా ఇటు తెలంగాణ సమాజం గానీ, అటు ప్రభుత్వం గానీ స్పందించాల్సిన విధంగా అస్సలు స్పందించలేదు.

నాకెందుకో ఈ సమయంలో కొన్ని ఏళ్ల క్రితం జరిగిన ఆ సంఘటనలు మళ్లీ గుర్తొస్తున్నాయి.
అది 2019 నవంబర్-డిసెంబర్ కాలం, నేను హెచ్‌ఎంటీవీ (HMTV) లో పనిచేస్తున్న రోజుల్లో హైదరాబాద్‌లో రెండు దారుణమైన సంఘటనలు వెంటవెంటనే జరిగాయి.
శంషాబాద్ పరిధిలో వెటర్నరీ డాక్టర్‌పై జరిగిన ఘోరానికి సమాజం పెద్ద ఎత్తున స్పందించింది కానీ, అదే సమయంలో ఆసిఫాబాద్ అటవీ ప్రాంతంలో ‘సమత’ అనే గిరిజన మహిళపై అంతకంటే ఘోరమైన అన్యాయం జరిగితే సమాజం ఆ స్థాయిలో పట్టించుకోలేదు.

ఆ రోజుల్లో బాధితురాల సామాజిక వర్గం వల్లే ఈ వివక్ష జరిగిందంటూ మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. కానీ విచిత్రం ఏంటంటే, ఈరోజు మళ్లీ అలాంటి గిరిజన బిడ్డలకు అంతకంటే పెద్ద అన్యాయాలు జరుగుతున్నా, నాటితో పోలిస్తే కనీసం స్పందించే స్థాయిలో కూడా అస్సలు స్పందన లేదు.

ఇంకో సంఘటన గురించి తెలుసుకుందాం….

ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా, హల్దోని గ్రామంలో ఆరేళ్ల వయసున్న ఒక ముస్లిం చిన్నారిపై అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న బాల్‌రాజ్ అనే వ్యక్తి అత్యంత దారుణంగా అత్యాచారం మరియు హత్యకు పాల్పడగా, పోలీసులు అతడిని అరెస్ట్ చేసి సీన్ రీకన్స్ట్రక్షన్ (Scene Reconstruction) కోసం తీసుకువెళ్తున్న సమయంలో అతడు పోలీసులపై తిరగబడటంతో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో (Encounter) నిందితుడు మరణించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *