మొగుడు కువైట్ లో..పెళ్ళాం పల్లెలో..ఏం జరిగిందో ఊహించుకోండి…

0
1000127407
Share

వారికి పెళ్లి అయి మూడేళ్లు.భర్త బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్ళాడు..భార్య కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తూ ఉండేది. ఆమెకు ఇంట్లో ఒంటరిగా అనిపించేది. ఈలోగా, ఆమె ఒక అబ్బాయితో సరసాలాడుతూ చూపులు విసురుకోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత అతనితో గాఢంగా ప్రేమలో పడింది.

ఆ తర్వాత, రాత్రింబగళ్లు శృంగారం మొదలైంది. ఈ వ్యవహారం సుమారు 3 సంవత్సరాల పాటు ఇలాగే కొనసాగింది. ఆ తర్వాత భర్త తిరిగి వచ్చాడు. దాంతో ఇప్పుడు తనకి విషయం తెలిసిపోతుందని భార్యకు అనుమానం రావడం మొదలైంది.

అప్పుడు భార్య తన భర్తను వదిలించుకోవాలని నిర్ణయించుకుని, రాత్రి అతను నిద్రపోతున్నప్పుడు తన ప్రియుడితో కుట్ర పన్ని అతడిని హత్య చేసింది.

ఆ తర్వాత, భార్య ఇంట్లో దొంగతనం జరిగిందని, దోపిడీ జరిగిందని, దొంగలు తన భర్తను చంపి పారిపోయారని గొడవ చేయడం మొదలుపెట్టింది. దర్యాప్తు కోసం మొత్తం పోలీసు బలగాలను రంగంలోకి దించారు.

అధికారులకు భార్యపై అనుమానం కలిగింది. కాల్ వివరాలు పరిశీలించగా అసలు కథ బయటపడింది. ఏడుస్తూ, అరుస్తున్న ఆమెను పోలీసులు తీసుకువెళ్లారు..బీహార్ కిషన్ గంజ్ లో ఈ ఘటన జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *