కొండాకు రేవంత్ రాఖీ గిఫ్ట్.. ఓ రేంజ్ లో.. మామూలుగా కాదు
కాంగ్రెస్ లో మంత్రి కొండా సురేఖ ఖేల్ ఖతం అయింది.మంత్రి పదవి ఊడినట్టే. రాజీనామా చేస్తారా,లేదంటే బర్తరఫ్ చేస్తారా అనేది మిగిలింది.లేదంటే కేబినెట్ reshuffle పేరుతో తప్పించవచ్చు. కాంగ్రెస్ అధికారకంగా ప్రకటించాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఢిల్లీ లో ఆమె మాటలను చూస్తే అర్ధమవుతుంది.. బీసీలకు ఓ న్యాయం…మిగతా వారికి ఓ న్యాయం ఎలా.? మిగతా సామాజిక వర్గాల మంత్రులపైనా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి? ఈ రెండు మాటలు.. కొండా చాప్టర్ క్లోజ్ అయిందనడానికి చాలు.మూడో విషయం కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు..అంటే అర్థమవుతుంది కదా..ఫ్యూచర్ ఏంటో.
రేవంత్ ను తక్కువ అంచనా వేస్తే.. రిజల్ట్ ఏంటో ఇది.
పార్టీ పై రేవంత్ కు పూర్తి పట్టు ఉంది..1000 రోజుల పాలనలో అటు ఇటు అయిందేమోగానీ .. పార్టీ ని పెర్ఫెక్ట్ గా కంట్రోల్ లో ఉంచుకున్నాడు. దీనికి కొండా ఇష్యూయే బెస్ట్ ఎగ్జాంపులు.
అర్థమైంది రాజా..
అన్న కోమటిరెడ్డియే సైలెంట్ గా ఉన్నారు..తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఎగిరేగిరి పడుతున్నారు..కొంచెం తగ్గు రాజా.. లేదంటే అసలుకే ఎసరు వస్తుంది..రాబోయే రోజుల్లో పెను రాజకీయ మార్పు..అందులో నా పాత్ర ఉంటుందని ప్రకటనలు వినటానికి బాగుంటాయి. వర్క్ ఔట్ కావు. చూస్తుంటే పనిలో పనిగా ఒకే దెబ్బకు రెండు పిట్టలు పడేలా ఉన్నాయ్. కొండా రాజీనామా చేస్తే బ్యాలెన్స్ కోసం బీసీ కే మంత్రి పదవి ఇవ్వాలి.అదే వరంగల్ జిల్లాకు చెందిన నేతకు ఇవ్వక తప్పదు..ఈ కోణంలో సురేఖ న్యాయం బ్యాలెన్స్ అవుతుంది. సీఎం రేవంత్ కు సన్నిహితంగా ఉన్న లీడర్ కు ఛాన్స్ దొరుకొతది.బస్వరాజు కు ఆ ఛాన్స్ రావొచ్చని టాక్.మంత్రి వర్గ విస్తరణ లో రంకెల రాజాకు హ్యాండివ్వడం గ్యారంటీ.. రాజగోపాల్ రెడ్డి సైలెంట్ గా పక్కాగా ఛాన్స్ ఇచ్చి ఉండేవారు రేవంత్..కానీ ఈ మధ్య రాజగోపాల్ రెడ్డి ఎక్కువ చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. నిజానికి ఆయన చాలా మంచి వ్యక్తి..త్వరగా కరిగిపోతారు..సాయం చేయడంలో ఈయనకు మించిన లీడర్ లేరు.పనుల విషయంలో ఇంతే.. కాకపోతే ఆవేశం ఎక్కువ.ఇదే ఆయనకు మైనస్.. కొంచెం ఆలోచనతో రాజకీయాలు చేస్తే.. సీఎంకు సహకరిస్తూ ఉంటే తిరుగు ఉండేది కాదు.

