మీరు గోల్డ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా?
లోన్స్ జోలికి అస్సలు వెళ్లొద్దు.కొన్నిసార్లు తప్పదు.తప్పనిసరి పరిస్థితుల్లో ఐతే ప్రభుత్వ బ్యాంకులకే వెళ్లండి.ప్రైవేట్ సంస్థలకు అస్సలు వెళ్లకండి.సర్కార్ బ్యాంకుల్లో కుదరకపోతేనే ప్రైవేట్ బ్యాంకులకు వెళ్లండి.సాధ్యమైనంత వరకు ప్రభుత్వ బ్యాంకుల్లోనే తీసుకోవాలి.ఎందుకంటే వడ్డీ రేటు తక్కువగా వుంటది.
ముందుగా టీజీబీ ..అదే తెలంగాణ గ్రామీణ బ్యాంకు వెళ్లాలి.ఇక్కడ అకౌంట్ లేకపోయినా,కుదరకపోయినా ఎస్ బీ ఐకి వెళ్లాలి.ఇక్కడ 7 నుంచి 9శాతం వడ్డీరేట్లు వుంటాయి.తర్వాత యూనియన్ ,పంజాబ్,కెనరా బ్యాంకులకు వెళ్లాలి.అకౌంట్ యాక్టివేట్ లో ఒక్కరోజులో ఈ బ్యాంకుల్లో పనిఅయిపోతుంధి.లేకపోతే లేట్ ప్రాసెస్.అయినా ఇక్కడే తీసుకునేందుకు ప్రయత్నించాలి.
ప్రైవేట్ బ్యాంకుల్లో వెళ్లాల్సి వస్తే..హెచ్ డీ ఎఫ్ సీ బెటర్.గంటలో లోన్ ప్రాసెస్ అయిపోతుంది.కాకపోతే వడ్డీరేటు ఎక్కువ.ప్రస్తుతం 12 శాతం మొదలవుతుంది.ప్రాసెసింగ్ ఫీజు డబుల్.యాక్సిస్ బ్యాంక్,కొటక్ బ్యాంక్ కు అసలు వెళ్లొద్దు.ఐడీఎఫ్సీకి అసలు పోవద్దు.ఈ బ్యాంక్ ఒకప్పటి ఎలంబీ బ్యాంక్ తో సమాచారం.దీని గురించి తర్వాత ఓ పోస్ట్ రాస్తాం..ఇక మీకు ఎదురైనా గోల్డ్ లోన్ అనుభవాలు కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రమా

