చికెన్,మటన్..బిర్యానీల్లో పెరుగు వేస్తున్నారంటే..వారికి సరిగ్గా చేయడం రాదు..

0
1000120429
Share


అవును ఇది పచ్చినిజం.ఈమధ్య ఎవడు పడితే వాడు..ఎక్కడ పడితే అక్కడ అడ్డాలు పెట్టేస్తున్నారు.యూట్యూబ్ ల్లో ఐతే వీడియోలు వందల్లో డంప్ చేస్తున్నారు.టన్నుల కొద్దీ పెరుగు కుమ్మరిస్తున్నారు.ఇలా చేసేటోళ్లు సరిగ్గా వంటరాదు.ఎందుకంటే చికెన్,మటన్ ల్లో అసలు పెరుగు వాడొద్దు.పైగా అది అంతా కల్తీ పెరుగు.అయినా కిలోల కొద్దీ వాడేస్తుంటారు.నిజానికి ఇది అవసరమే లేదు.అన్ని ఒకేసారి కుమ్ముస్తుంటారు.మాడిపోకుండా ధీన్ని వాడేస్తుంటారు.ఇలా చేసే సరికి అసలు టేస్ట్ పోతుంది.బిర్యానీలు అసలు చేస్తారో తెలియనోళ్లు,హోటళ్లే ఇలా చేస్తాయి.
ఒక్కసారి 20ఏళ్లు వెనక్కి వెళ్లండి.వంటలు ఎలా చేశారో గుర్తుస్తోంది కదా.రాష్ట్రమంతా భూతద్దం వేసి వెతికినా ఒక్కడు కూడా ఇలా పెరుగు వేసి చేసేటోడు కనిపించలేదు.మరి ఇప్పుడు ఎందుకు అంతగా వాడేస్తున్నారు.అస్సలు టేస్ట్ పొగొడుతున్నారు.
ఒక్కసారి పెరుగు వాడకుండా చికెన్,మటన్ బిర్యానీలు చేయండి.
టేస్ట్ లో ఎంతో తేడా వస్తుంది.నూనె వేసిన తర్వాత మసాలు అన్ని ఒకేసారి కాకుండా వన్ బై వన్ వాడండి.ఎంతో రుచి వస్తోంది.శుచిగా వుంటుంది.తెల్లారేదాకా చెడిపోదు.అదే పెరుగు వాడితే మటాష్.
మీకు అంత వాడాలనిపిస్తే పెరుగు బదులు చింతపండు రసం వాడండి.టేస్ట్ కు టేస్ట్..రెండ్రోలైనా కూర పాడవ్వదు.
లేకుంటే కొంచెం నిమ్మరసం వాడండి..చికెన్,మటన్ సూపర్ టేస్ట్ వస్తోంది.
పెరుగువాడటం మానేయండి..టేస్ట్ పోవడమే కాదు.కల్తీ పెరుగుతోో మనకు తెలియకుండా ఆరోగ్యాలు కరాబ్ అవుతున్నాయి.సో వాడాల్సి వస్తే..తప్పనిసరైతే నిమ్మరసం కొంచెం వాడండి అంతే.ఇలా చేసి ఒక్కసారి ట్రై చేయండి.మీకు అసలు సిసలైన టేస్ట్ తెలుస్తోంది.ఎంతైనా పెద్దల మాట..టేస్టీ మూట గురూ.ఇక మీ అభిప్రాయం ఏంటో చెప్పడం మర్చిపోవద్దు మిత్రమా.


.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *