మిమ్ముల్ని వెంటాడుతున్నారు..జాగ్రత్త..!

0
1000115790
Share

ఇప్పుడు అంత ఇస్మార్ట్ యుగం.అందరి చేతుల్లో మంచి మంచి మొబైల్స్.అంత 4g,5g ఫోన్లు. తక్కువలా తక్కువ రూ.10వేల నుంచి మొదలవుతాయి. ఐఫోన్స్ దాకా స్టేటస్ ను వాడేస్తున్నారు.. ఇదే దొంగలకు ఈజీగా మారింది.రోజుకు ఒక్క ఫోన్ కొట్టేసిన వాడి వాడి కూలి వెళ్ళి పోతుంది. ఎంత లేదన్న రూ.రెండు,3వేలకు అమ్ముతారు.అందుకే ఈజీ మానీకి అలవాటు పడిన దొంగలు సెల్ ఫోన్లు కొట్టేస్తున్నారు.
రద్దీ బస్సులే టార్గెట్..!
సిటీ బస్సులు ఇప్పుడు చాలా తగ్గాయి.బస్సులు రావడమే తగ్గాయి.వచ్చిన బస్సు ఎక్కడానికి జనం ఎగబడుతున్నారు.ఫ్రీ బస్ అయ్యాక లేడీస్ వెనుక సీట్లకెళ్లి కూడా ఎక్కుతున్నారు. ఇదే సెల్ చోరీలకు తెరతీస్తుంది. లేడీస్ ఎక్కని కదా అని వెయిట్ చేసేలోపే..ఎవరి జేబులో సెల్ ఉందన్నది అంటే ఖతం. సెకన్లలో కొట్టేస్తారు.మన జేబులకు వర్క్ కవరు లేదా గొడుగు లేదా సంచి ఇలా ఏదో ఒకటి అడ్డుపెడతారు.బస్ ఎక్కే హడావుడిలో ఉండగా ఈలోపే సెల్ ఫోన్ లేపేస్తారు.మనం చూసుకునే లోపే బస్ వెళ్ళిపోతుంది..
అడ్డాలు ఇవే…
హైటెక్ ఆల్ బస్ స్టాప్స్ .కొండాపూర్, కూకట్ పల్లి,ఎల్ బీ నగర్, మెహదీపట్నం,లింగం పల్లి ఇలా ప్రతి ఏరియాలో దొంగలు ఉన్నారు జాగ్రత్త..
లేడీ గ్యాంగ్స్..!
గుంపు గా వెనక డోర్ వైపు హడావుడిగా బస్ ఎక్కేందుకు వస్తారు..అంత రౌండప్ చేసి ..ఇద్దరు ముగ్గురు దగ్గర ఫోన్లు కొట్టేస్తారు..next stop లో దిగిపోతారు.లేదంటే మధ్యలో డ్రైవర్ తో గొడవపడి మద్యలోనే దిగిపోతారు..
లేడీస్ బ్యాగ్స్ పై కన్ను..!
వచ్చేదాకా ఫోన్స్ చూడటం, మాట్లాడటామ్ కామన్. బస్ రాగానే బ్యాగ్ లో పెట్టుకుని ఎక్కేస్తున్నారు.. ఏమాత్రం ఏమరపాటుగా అంతే..మీ ఫోన్ గోవిందా..
సెల్ పోతే ఎక్కడ ఉన్నా ఈజీగా దొరుకుతుందనేది ఒకప్పటి నమ్మకం. ఇప్పుడు అలా కాదు.మనం ఎంత సెక్యూరిటీ పెట్టుకున్న లాభం లేదు.. IMEI నంబర్ ని కూడా మార్చేస్తున్నారు. సో పోక ముందే జాగ్రత్తగా ఉండండి…

పొరపాటున పోతే ఎలా..?
పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయాలి.లేదా ఆన్లైన్ లో కంప్లైంట్ చేయాలి. ఫిర్యాదు చేశాం వెతికి పెడతారు అనుకుంటే పొరపాటే..ఏవైనా ఎస్ఐ లేదా సీఐ తెలిసి ఉంటే..ఒకటి రోజుల్లో మీ ఫోన్ దొరుకుతుంది.లేదంటే ఆశలు వదులుకోవాల్సిందే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *