టీటీడీ డిప్యూటీ ఈవో మీదనే కాదు.. టీటీడీ అధికారుల అందరిఇళ్ళపైనా ఏసీబీ దాడి చేయాలి..

0
Share

దందా దేవుళ్లు..ఈ మాట అంటే కోపం వస్తుంది.కానీ ఇది పచ్చి నిజం. తిరుమలలో అక్రమాలు మామూలుగా ఉండవు.. వెంకన్న స్వామికి టోకరా వేస్తారు. మామూలు ఉద్యోగి నుంచి అధికారిదాకా ఇంతే.దర్శనాల నుంచి షాప్స్ దాకా..ప్రతి దాంట్లో కలెక్షన్స్ కు అలవాటు పడ్డారు. ఇది అందరికీ తెలుసు.ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు.. వాళ్ళకు సన్నిహిత అధికారులు దేవుడు సొమ్మును మాయం చేస్తారు. దొరికితే కదా అనుకుంటూ లక్షలు,కోట్లు కొట్టేస్తున్నారు. ఏ 20 ఏళ్లకో ఏసీబీ సోదాలు జరగవు.అందుకే అధికారులు రెచ్చిపోతున్నారు.ఆధిపత్య పోరు ఎక్కువ అయినప్పుడు ఇలా బయట పడుతాయి అంతే. నిజంగానే దేవుడి మీద ప్రేమ ఉంటే టీటీడీ అధికారుల అందరి ఇళ్ళ లో ఏసీబీ సోదాలు జరపాలి. కొట్టేసిన సొమ్ము ఎన్ని వేల కోట్లు ఉన్నాయ్ అనేది తేల్చాలి..అని భక్తులు కోరుతున్నారు..కానీ ఏ సర్కార్ ఈ పని చేయదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *