చికెన్,మటన్ బిర్యానీలు ఇక్కడ ఫేమస్ .. ఎందుకంటే…

0
1000120478
Share


చికెన్,మటన్ బిర్యానీలు ఈమధ్య చేసేవాళ్ల సంఖ్య ఎక్కువైంది.ఎక్కడ చూసినా బిర్యానీ అడ్డాలే కనిపిస్తున్నాయి.ఎక్కడ ఎలా వుంటుందో తెలియదు.ఆకలి వేసిందంటే అందులోకి వెళ్తున్నాం.చికెనో,మటన్ బిర్యానీయో ఆర్డర్ ఇచ్చేస్తున్నాం.తినటప్పుడే ఆ హోటల్ టేస్ట్ ఏంటో తెలిసి పోతుంది.బాగా వుంటే లొట్టలేసుకుంటూ తింటాం.నార్మల్ అయితే అలా అలా కానిచ్చేస్తున్నాం.బాగోలేకపోతే మళ్లీ ఆ హోటల్ వైపు కన్నెత్తి చూడం.అలాంటి వాటికి ఫీడ్ బ్యాక్ ఇచ్చినా పెద్దగా పట్టించుకోరు.సో ఇలాంటివాటిని లైట్ తీసుకుంటాం.వీళ్లు ఎప్పటికీ మారారు.చివరకు హోటల్ ఎత్తేసుకుంటారు.
ఇక మంచి టేస్టీ బిర్యానీలు ఎక్కడ దొరుకుతాయి్ ..
సిటో మంచి బిర్యానీ ఇప్పటికీ సికింద్రాబాద్ ప్యారడైజ్,ఆర్టీసీ క్రాస్ రోడ్స్ బావార్చియే.వీటిని మించి తోపులు నగరంలో ఇంకా రాలేదు.షా గౌస్,మెహిఫిల్ ఫర్వాలేదు.బడ్జెట్ లో అయితే మెహెఫిల్ సూపర్.రూ.240కే ఫుల్ బిర్యానీ వచ్చేస్తోంది.సింగిల్ రూ.130.ఈ మధ్య ఎక్కడపడితే అక్కడ వీటిని తెరిచేశారు.టెస్ట్ కూడా వోకే.ఆన్లైన్ ఆర్డర్ చేస్తే అప్పుడప్పుడు ఝలక్ లు ఇస్తాడు మెహెఫిల్ మాస్టర్.క్వాంటీటీ విషయంలో ,ప్రైస్్లో సీటీ ఇదే నెంబర్ వన్.
షా గౌస్..సూపర్ టేస్ట్..కానీ ఆయిల్ ఎక్కువగా వుంటుంది.క్యాంటీటీ చాలా తక్కువ.ప్రైస్ ఎక్కువ.అన్నింటికంటే గచ్చిబౌలి అడ్డాలో బాగా వుంటుంది.
ప్యారడైజ్..సికింద్రాబాద్ లో ఫేమస్.మిగతా బ్రాంచ్ లు వేస్ట్.క్వాలిటీ,క్యాంటీటీ తక్కువ.పైగా ప్రైస్ ఎక్కువ.రూ.300 వందలు పెట్టిన ఒక్క పూటకే సరిపోదు.ఈ మధ్య గచ్చిబౌలిలో బాగుందనే టాక్ వినిపిస్తోంది.సికింద్రాబాద్ దీనికే ఓటేస్తున్నారు కస్టమర్లు.
ఆతర్వాత సర్వి,మెరిడియన్ బాగుంటాయి.మెరిడియన్ టేస్ట్ బాగుంటుంది కానీ వీడికి బలుపు ఎక్కువ అనే మాట వినిపిస్తుంది.
లోకల్ ఏరియాల్లో..
కూకట్ పల్లి విషయానికి వస్తే రాజారాణి రుచులు సూపర్.లైవ్ లో అక్కడ తింటేనే అది.ఆర్డర్ చేశామంటే తేడానే.సరిగా ఉడకనిది,ఉప్పు ఎక్కువగా వున్నది పంపిస్తాడు.ఒక్కసారి కాదు ఎప్పుడూ ఇంతే.రేటుగా తక్కువేం కాదు.మెహఫిల్ కంటే వంద రూపాయలు ఎక్కువే.చైతన్య రెస్టారెంట్ ఫుడ్ కైతే వోకే.టిఫిన్స్ కూడా.
బాబాయ్ బిర్యానీ…
ఇది కేపిహెచ్ బీ మెట్రో రైలు స్టేషన్ కింద వుంటుంది.రేటు తక్కువ.టేస్ట్ ఎక్కువ.తొలుత రూ.99 వుండే.ఇప్పుడు 120 చేశాడు ఆయిల్ తక్కువగా వుంటది.టేస్ట్ మాత్రం సూపర్.కొన్నిసార్లు అనిపిస్తుంది రాజారాణి,ప్యారడైజ్,మెహఫిల్ కంటే ఇదే బెటర్ అనిపిస్తుంది.
ఆల్విన్ కాలనీలో స్పైసీ రెస్టారెంట్.ప్రిన్స్ దాబా.మంచి టేస్టే వుంటాయి.కానీ రేట్ మరి ఎక్కువ.అంతా రేటు పెట్టినా ఒక్కరికి కూడా సరిగ్గా సరిపోదు.ఇక్కడ సింగిల్ 260 నుంచి స్టార్ట్ అవుతుంది.
గుట్టలో మౌనిక బిర్యానీ.
జగద్గిరిగుట్టలో ఇది ఫేమస్.ఇక్కడ నాలుగేళ్ల కిందట తొలుత హోటల్ ప్రారంభించినప్పుడు ఎగ్ బిర్యానీ రూ.80.చికెన్ బిర్యానీ రూ.100 ఉండేది.రుచి,శుచి సూపర్ గా ఉండేది.గుట్ట నుంచి ఐడీపీఎల్ వెళ్లే రూట్ లో వుండేది.ఇక్కడ కర్రీస్ కూడా బాగుండేవి.కానీ సడెన్ అడ్డా మార్చేశాడు.కనీసం ఎక్కడ మార్చిందో అక్కడ ఫ్లెక్సీ పెట్టలేదు.చాలామంది రెగ్యులర్ కస్టమర్లకు ఇప్పటికీ ఎక్కడకు మార్చారో తెలియదు.అడిగితే పక్కనే వుందన్నారు.కానీ బోర్డు ఐతే ఎప్పుడూ కనిపించలేదంటారు కస్టమర్లు.ఇది కాకుండా గుట్ట ఏరియాలో ఎక్కడ నార్మల్.మెహఫిల్ వాడు ఇక్కడ హోటల్ పెడితే సూపర్ డూపర్ నడుస్తుంది.ఎందుకంటే ఫేమస్ ఉన్నవి లేవు.
ఇక మియాపూర్ ఏరియాలో..
చాలా హోటళ్లు వున్నాయి.కానీ పెద్దగా పేరొచ్చివి ఏం లేవు.బగారా బువ్వ కోడికూర అని ఓ బోర్డు మియాపూర్ చౌరస్తాలో కనిపిస్తుంది.కానీ ఇందులో వెళ్లినోళ్లు అయితే వోకే వోకే అన్నారు.ఓసారి వెళ్లి టేస్ట్ చూశాకా మీకు ఎలా వుందో చెబుతాను..ఉట్టిగానే మంచి పద్దతికాదు కదా..ఇక చందానగర్ లో ఒకప్పుడు కావేరి హోటల్ ఫేమస్ట్.ఇక్కడ సూపర్ టేస్ట్ వుంటుంది.ఇప్పుడు చాలా వచ్చాయి.పెద్దగా ఫేమస్ వున్నవి ఏం లేవు.
కొండాపూర్,హైటెక్ సిటీ ఏరియాలో..
కొత్తగూడ చౌరస్తాలోని షా గౌస్,సైబర్ టవర్స్ ఎదురగా మెహఫిల్ ఫేమస్.సూపర్ సూపర్ టేస్టీగా వుంటాయి.ఇవి ఎప్పుడూ జనంతోో కిటకిటలాడుతుంటాయ.ఒకటే గుర్తు పెట్టుకోవాలి.టేస్ట్ ఎక్కువగా వున్న దగ్గర కస్టమర్లు ఎక్కువగా వుంటారు.కొండాపూర్ సత్తిబాబు బిర్యానీ సెంటర్..పేరుకే ఫేమస్.వీళ్లకి ధమ్ బిర్యానీ వండటం రాదు.పలావ్ లో చికెన్ కర్రీ వేసి కలిపి బిర్యానీ అంటారు.
ధమ్ బిర్యానీ అంటే ప్యారడైజ్,షా గౌస్,మెహఫిల్,బావర్చిలంతే.మిగతా అంతా వేస్ట్.
మణికొండలో,దిల్ సుఖ్ నగర్,ఎల్్ బీ నగర్ ఏరియాల్లో మరోసారి రాస్తాం.మేము చెప్పేదే కాదు..మీ ఏరియాలో మికు నచ్చిన బిర్యానీ అడ్డా ఏంటో కామెంట్ చేయండి.మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *