సాయిదుర్గ తేజ్ ..కాబోయే భార్య ఎవరంటే..

0
1000154431
Share

డిసెంబర్ 10న పెళ్లి!

టాలీవుడ్‌లో మరోసారి మెగా ఫ్యామిలీ పెళ్లి సందడి మొదలైంది. మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిదుర్గ తేజ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గత కొంతకాలంగా ఆయన పెళ్లిపై సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ నవంబర్ 5న హైదరాబాద్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు.

హిల్టన్ హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ రిసార్ట్‌లో జరిగిన ఈ వేడుకకు కొణిదెల, అల్లు కుటుంబాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ సహా పలువురు కుటుంబ సభ్యులు ఈ వేడుకలో సందడి చేశారు.

ఇంతకీ కాబోయే భార్య ఎవరు?

సాయిదుర్గ తేజ్ ఎంగేజ్‌మెంట్ తర్వాత అందరిలోనూ ఆసక్తి రేపుతున్న ప్రశ్న ఇదే. ఆయనకు కాబోయే జీవిత భాగస్వామి పేరు కిరణ్మయి.

చిన్ననాటి స్నేహితురాలా? ఎలా పరిచయం?

కిరణ్ సాయితేజ్‌కు చిన్ననాటి స్నేహితురాలని తెలుస్తోంది. స్నేహితులని, ప్రేమలో ఉన్నారు. అయితే ఈ విషయంపై సాయిదుర్గ తేజ్ నుంచి స్పష్టమైన ప్రకటన లేదు.

లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా?

ఇదే ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చ. ఒకవైపు చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లి అంటూ కథనాలు వస్తుంటే, మరోవైపు పెద్దలు కుదిర్చిన సంబంధమనే ప్రచారం కూడా గతంలో జరిగింది.

కానీ ఈ పెళ్లి ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన వివాహమా? అనే విషయాన్ని తేజ్ అధికారికంగా వెల్లడించలేదు. కాబట్టి దీనిపై ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం సరికాదు.

డిసెంబర్ 10న పెళ్లి!

నిశ్చితార్థం పూర్తికావడంతో ఇప్పుడు మెగా అభిమానుల చూపంతా పెళ్లి వేడుకపైనే ఉంది. డిసెంబర్ 10న హైదరాబాద్‌లో సాయిదుర్గ తేజ్, కిరణ్ వివాహం జరగనుంది. ఈ వేడుకకు మెగా, అల్లు కుటుంబాలతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

మొత్తానికి సినిమాల్లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న సాయిదుర్గ తేజ్.. ఇప్పుడు జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. ఆయన పెళ్లి వెనుక ఉన్న పరిచయం, ప్రేమకథ గురించి మరిన్ని వివరాలు ఎప్పుడు వెల్లడిస్తారో చూడాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *