కొండా సురేఖ రాంగ్ స్టెప్ వేసింది ఇక్కడే..ప్లాన్ బీ కాదు.. ప్లాన్ R వర్కౌట్
పాపం కొండా సురేఖ..మంత్రి పదవి మరో సారి చేజేతులా పోగొట్టుకుంది. కొంచెం తెలివిగా ఆలోచిస్తే మరో రెండేళ్లు పదవిలో ఉండేవారు.అప్పుడు పరకాలలో ఎవరి ప్రతాపం ఏంటో తెలిసేది.కాంగ్రెస్ లో లాస్ట్.. బీ ఫార్మ్ దొరికేవరకు ఎవరికీ గ్యారంటీ ఉండదు.అది తెలిసి కూడా చిట్టెక్క మాటలు పట్టుకుని చెట్టు ఎక్కింది.కొమ్మ విరిగి కొండ కుప్పకూలింది. ఇది కొండా ఫ్యామిలీకి కొత్త కాదు. కానీ మంత్రి పదవి పోవడం లైట్ తీసుకునేంత ఈజీ కాదు.కొండా మురళి మీసం తిప్పితే అభిమానులకు నచ్చుతుంది.జనానికి కాదు.ఏసీబీ కేసు టైమ్ లో అచ్చం రేవంత్ రెడ్డి తిప్పినట్టే తిప్పిండు. ఇక్కడ రేవంత్ స్టయిల్ ఫాలో కావొచ్చు..కానీ ఆయనలా పొలిటికల్ గేమ్ ఆడలేరు. ఇది నిజం.కొండా సురేఖను సీఎం రేవంత్ ఎంతో ప్రేమతో అక్క అక్క అని పిలిచేవాళ్ళు.1000 రోజుల పాలనలో 900 రోజులు బాగానే చూసుకున్నారు.ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినా వెనకేసుకొచ్చారు. అయినా కొండా ఫ్యామిలీ తీరు సరిగా లేదు.ఉట్టి దానికే చిట్టెక్క చిటపటలాడటం..గన్ మెన్ సుమంత్ విషయం లో ఓవరాక్షన్ చేయడం..ఆ తర్వాత ఏదోలా పరిస్థితి సద్దుమణిగింది.మళ్ళీ పరకాల విషయంలో కెలికికుంది. సీఎం రేవంత్ ఫ్లో లో అలా అన్నారా లేదా కావాలనే రేవూరికి టికెట్ అన్నారోగానీ..కొండా ఫ్యామిలీ లోలోపల కుతకుతలాడిపోయింది.అసలే చిటపట అక్క మంట రాజేసింది.రేవంత్ అండ్ కో కు మండింది.కొండా సురేఖ పదవి ఊడింది.
కొండా సురేఖ అన్యాయం జరిగింది వాస్తవం..ఎవరి కారణంగా ఆమె బిడ్డే వల్లే..రేవంత్ వాళ్ళని ఒక్క మాట అనకుండానే సైలెంట్ గా పనికానిచ్చిచేశారు.కొండా కొంచెం తగ్గి.. చిట్టెక్క చేత సారీ చెప్పించి ఉంటే ఇంతదాకా వచి ఉండేది కాదు. ఇప్పుడు తెలిసింది కదా రేవంత్ పవర్ ఏంటో..కొండా ఎపిసోడ్ లో బీసీ కార్డును కాంగ్రెస్ తెలివిగా వాడుకుంది.కొండా ఎంత అరిచినా..ఎన్ని ఆరోపణలు చేసినా జనం పట్టించుకోరు.. అయినా ఈ విషయం లో రేవంత్ పైనే జనానికి సాప్ట్ కార్నర్ ఉంది..కొండా ఫ్యామిలీ గోటి తో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంది అని అనుకుంటున్నారు.. కంటే కూతురినే కనాలి..అని సెటైర్ వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్.

