అక్కడ అదే తీర్పేనా?ఇంకేమైనా ట్విస్టులు వుంటాయా?
ఏపీ పరిషత్ పోరు ముగిసింది. 7న ఫలితాలు రాబోతున్నాయి. రాష్ట్రంలోని 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 21,012 మంది అభ్యర్థులు పోటీ చేశారు.మున్సిపల్ ఎన్నికల్లాగే తీర్పు వుండబోతుందా?ఇంకేమైనా ట్విస్టులు వుంటాయా? అంటే నో ఛాన్స్ అని చెప్పేయొచ్చు.ఎందుకంటే అధికారంలో ఏపార్టీ అంటే దానికే జనం ఓటేయడానికి మొగ్గుచూపుతారు.దీనికి అభివృద్ధి అని ఒకే ఒక మాట కారణం.అధికారంలో కూటమి..జడ్పీటీసీ,ఎంపీటీసీలుగా వైసీపీవాళ్లను గెలిపిస్తే లాభం లేదనుకుంటారు.కాకపోతే విపక్షం పట్టున్న స్థానాల్లో ఇది వర్కౌట్ కాదు.
రాష్ట్రంలో ‘పరిషత్’ ఎన్నికల పోలింగ్ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనల మధ్య ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగిసే సమయానికి క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. గురువారం ఉదయం 7 గంటల నుంచే ప్రజలు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రాష్ట్రంలోని 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 21,012 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మొత్తం 659 జడ్పీటీసీ, 9,821 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 77 జడ్పీటీసీ, 2051 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 582 జడ్పీటీసీ స్థానాలకు గానూ 2,169 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 7,767 ఎంపీటీసీ స్థానాలకు 18,843 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నవంబర్ 7న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడబోతున్నాయి.
15 జిల్లాల పరిధిలో 37 గొడవలు
పరిషత్ ఎన్నికల్లో 15 జిల్లాల పరిధిలో 37 గొడవలు చోటుచేసుకున్నాయని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఘటనలు జరిగాయని వాస్తవాల ఆధారంగా కారకులపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని చెప్పారు. పోలింగ్ ప్రక్రియకు, శాంతిభద్రతలకు ఆటంకం కలిగిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. ఎన్నికలకు ఆటంకాలు సృష్టించినవారిని ఉపేక్షించలేదని వార్నింగ్ ఇచ్చారు.
