రేషన్..పరేషాన్..పాపం ఎన్ని కష్టాలు.. ఉత్తమ్ సార్..జర క్లారిటీ ప్లీజ్…

0
1000128004
Share


రేషన్ కోసం పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు.క్యూ లైన్ లో గంటలకొద్దీ నిలబడాల్సి వస్తోంది.తీరా స్టాక్ అయిపోయిందటూ పంపిస్తున్నారు.మూడు నెలల రేషన్ re ఇస్తున్నారు.తీసుకోకపోతే ఎక్కడ కార్డు పోతుందోనని టెన్షన్ పడుతున్నారు.రేషన్ దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు.నెలరోజులుగా
ప్రతి ఫ్యామిలీ ఇలా రేషన్ కోసం కష్టాలు పడ్డారు.ఇప్పుడు నెల మారింది.రేషన్ ఇస్తారో,లేదననే అనుమానం.దీనికి తగ్గట్టు చాలా షాపులు మూసి వుంటున్నాయి.గడువు అయిపోయింది అందరూ అనుకుంటున్నారు.కానీ ఈ నెల కూడా రేషన్ ఇస్తారని అధికారులు పదే పదే ప్రకటనలు చేయకపోవడమే దీనికి కారణం.ఈ నెల ఎప్పటిదాకా ఇస్తారో క్లారిటీ ఇవ్వాలి.

ఇప్పటికి ఎన్నో వేలమంది రేషన్ తీసుకోలేదు.ఎన్నో షాపులు తిరిగినా..బియ్యం దొరకడం లేదని వాపోతున్నారు.సర్కార్ గడువు బాగుండని అనుకుంటున్నారు.గత నెల ఇచ్చినా పెద్ద సగం మంది కూడా తీసుకోలేదు.
ఎందుకంటే క్యూ లైన్ నిలబడినా ,స్టాక్ గంటలకొద్దీ టైమ్ పడుతుంది.ఒక్కో కార్డుకు 10 నిమిషాలపపైనే పడుతుంది.మూడు నెలలకు మూడుసార్లు వేలిముద్రలు పెట్టాలి.ఒక్కోసారి పెడితే..ఒక్కోసారి మాత్రం బియ్యం జోకుతున్నారు.దీంతో సమయం ఎక్కువ పడుతుంది.క్యూలైన్ లో పది మంది వున్నా గంట,రెండు గంటలు పడుతుంది.సర్వర్ స్లో వుంటే చుక్కలే.
సందట్లో సడేమియా..
మూడు సార్లు తూకం వేస్తున్నారు రేషన్ డీలర్లు.అన్ని కిలోలు ఒకేసారి జోకడం లేదు.ఒక్క కుటుంబానికి నెల 36 కిలోలు వస్తున్నాయి.30కిలోలు మూడు సార్లు తూకం వేస్తున్నారు.మధ్యలో 6 కిలోలు సెపరేట్ గా ఇస్తున్నారు.ఇలా ఒకటో,రెండో సార్లు మస్కా కొడుతున్నరు.ఒక్కో కార్డులు కనీసం 6కిలోలు కొట్టేస్తున్నారు డీలర్లు.జాగ్రత్తగా చూసుకుంటే మాత్రం ఎలాంటి తేడా వుండదు.చాలామంది లెక్కల్లో వీక్..మూడు నెలలు,మూడుసార్లు థంబ్ అనేసరికి తికమక పడుతున్నారు.
రేషన్ గడువుని పెంచాలి.
నిజానికి ఈనెల 5 వరకే అని ప్రచారం జరుగుతోంది.దీంతో రేషన్ షాపుల క్యూ కడుతున్నారు.అసలు ఎప్పటిదాకా ఇస్తారో అధికారులు క్లారిటీ ఇవ్వాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *